Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కొడుకు అనుమానాస్పద మృతి!

ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కొడుకు అనుమానాస్పద మృతి!

వార్త 0 months ago

Edulabad Farmhouse Death: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.

ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ ఎస్‌ఐ కుమారుడైన యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Jammu Fire Accident: జమ్మూ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం..దగ్ధమైన 35-40 దుకాణాలు

పుట్టినరోజు పార్టీకి వెళ్లి విగతజీవిగా..

ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో కృష్ణ కౌండిన్య అపస్మారక స్థితిలో పడిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రిషబ్ తండ్రి ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై యువకుడిని ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కృష్ణ కౌండిన్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుమారుడి మృతిపై తండ్రి ఫిర్యాదు

తన కుమారుడి మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Edulabad Farmhouse Death: అసలు ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తు

పుట్టినరోజు వేడుకల సమయంలో ఏం జరిగింది? యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి కారణాలేంటి? అతడి మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు విచారణలో వెల్లడయ్యే వివరాలు కీలకంగా మారనున్నాయి. 21 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే మరణానికి గల అసలు కారణం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

పెళ్లి చేసుకోవాలని ప్రియుడికి వీడియో కాల్.. మాదాపూర్‌లో యువతి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha