Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధైర్యముంటే నాపైకి బుల్డోజర్లు పంపండి: బీజేపీకు మమత సవాల్

ధైర్యముంటే నాపైకి బుల్డోజర్లు పంపండి: బీజేపీకు మమత సవాల్

వార్త 2 weeks ago

Mamata banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై జరిగిన దాడితో పాటు కోల్‌కతాలోని కాళీఘాట్‌లో కాళీపూజ వేడుకలకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ED: ఈడీకి 'సూపర్ కాప్' అధికారాలు లేవు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

అభిషేక్ నివాసాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మమత, “మీరు బుల్డోజర్లు తీసుకురావాలనుకుంటున్నారా? రానివ్వండి! వాటిని మాపై నుంచే, మా మృతదేహాల పైనుంచే పోనివ్వండి. ఎంతమంది బుల్డోజర్లను తెస్తారో తెండి.. నేను ఇక్కడే నిలబడి ఉన్నాను” అని సవాల్ విసిరారు.

2 గంటలకు అభిషేక్ నివాసంపై దాడి!

కాళీఘాట్ రోడ్డులోని తన నివాసంపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీజేపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. గత ఆరు నెలల్లో తనపై జరగడం ఇది ఏడో దాడి అని, ఇది తన ప్రాణాలు తీసేందుకు చేసిన యత్నమని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను షేర్ చేస్తూ.. “గత రెండు రోజులుగా రెక్కీ నిర్వహించిన తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు బీజేపీ గూండాలు నా ఇంటిపై దాడి చేశారు. ఎన్నికైన ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే బెంగాల్‌లో సామాన్యుల పరిస్థితి ఏమిటో ఊహించండి. ఇన్ని దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు పోలీసుల చర్యలు లేవు, న్యాయస్థానాల జోక్యమూ లేదు” అని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాళీపూజ వేడుకలకు ఆటంకాలు!

కాళీఘాట్ ప్రాంతంలో ఏళ్లుగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న కాళీపూజ వేడుకలను కూడా అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎప్పటినుంచో అనుమతులున్న పూజలకు అడ్డంకులు సృష్టిస్తూ, ప్రధాన రహదారిపై కొత్తగా ఏర్పాటు చేసిన ఒక పూజకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఆమె మండిపడ్డారు.

“స్థానిక క్లబ్బులు ఏళ్లుగా శాంతియుతంగా కాళీపూజలు నిర్వహిస్తున్నాయి. కానీ రాత్రి 9 గంటల సమయంలో ప్రధాన రహదారి మలుపు వద్ద పూజ పండల్‌ను ఏర్పాటు చేసి మా పూజలకు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. స్థానిక ప్రజలు పూజల్లో పాల్గొనకుండా బీజేపీ గూండాయిజం చేస్తోంది” అని మమత ధ్వజమెత్తారు.

ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నందుకే దాడులు!

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘ఇండియా’ (INDIA) కూటమికి మద్దతుగా నిలుస్తున్నందునే బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.

“మేము ఇండియా కూటమితో కలిసి నిలబడ్డామనే కారణంతోనే మమ్మల్ని వేధిస్తున్నారు. మీరు ప్రజలను అణచివేస్తుంటే మేం మౌనంగా చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు” అని మమత స్పష్టం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి కలకలం.. ఆరు నెలల్లో ఏడుసార్లు టార్గెట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha