Inflation Hits an Eight-Month High : శంలో మళ్లీ ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఆగస్టు 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది.
జూలైలో నమోదైన 4.45 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. తాజా గణాంకాల ప్రకారం ఇది ఎనిమిది (Inflation Hits an Eight-Month High) నెలల గరిష్ట స్థాయి. దీంతో సామాన్యులపై నిత్యావసరాల ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆహార ధరల్లో వచ్చిన వేగవంతమైన పెరుగుదల :
ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం ఆహార ధరల్లో వచ్చిన వేగవంతమైన పెరుగుదల. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం సుమారు 5.95 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి కొన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు టమాటా, బంగాళాదుంప వంటి కొన్ని వస్తువుల ధరలు తగ్గడం కొంత ఊరటనిచ్చింది. అస్థిర వాతావరణ పరిస్థితులు కూడా ఆహార సరఫరాపై ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రాంతాల వారీగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ధరల ఒత్తిడి మరింత ఎక్కువగా కనిపించింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.23 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి చేరింది. తెలంగాణలో కూడా ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదై 6.27 శాతానికి చేరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యం కంటే పైనే ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6 శాతం సహన పరిధిలోనే ఉంది.
ద్రవ్యోల్బణం మరింత పెరిగితే వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆగస్టులో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం కూడా 9.92 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 9.78 శాతంగా ఉంది. ఆహారం, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల హోల్‌సేల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మొత్తంగా చూస్తే.. ఆహారం నుంచి ఇతర వినియోగ వస్తువుల వరకు ధరల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం గమనమే కీలకంగా మారనుంది. ముఖ్యంగా సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

