Dharmavaram ATM Robbery: ధర్మవరంలోని పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడీఎఫ్సీ ఏటీఎం మిషన్ ను అంతరాష్ట్ర దొంగలముఠా దొంగతనం చేశారు.
వన్ టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు బుధవారం తెల్లవారుజామున దొంగలు ఏటీఎం మిషన్ ను చోరీచేశారు. దాదాపు 8 మంది బొలొరో వాహనంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఏటీఎం వదకు వచ్చారు. మొదట ఏటిఎం మిషన్ను ఇనుపరాడ్లతో కదిలించి అనంతరం మిషన్కు తాడును చుట్టారు. ఆ తాడును బయట ఉన్న బొలెరో వాహనానికి కట్టారు, వాహనాన్ని ముందుకు నడపడంతో ఏటీఎం సెంటర్కు ఉన్న గ్లాస్కు డోరు తాడు తగిలి డోర్ మొత్తం ధ్వంసమైంది.
Read Also: Kamareddy Road Accident:పెళ్లింట రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు
Dharmavaram ATM Robbery
వాహనాన్ని వేగంగా నడపడంతో ఏటీఎం మిషన్ బయటకు వచ్చి పడింది. ఏటీఎం మిషన్ను బయటకు లాగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో నిద్రలో ఉన్న స్థానికులు బ్యాంకు పైన ఉన్న వారు బయటకు వచ్చి చూడగా బొలోరో వాహనంలో దొంగలు పారిపోవడాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ లోక్ నాథ్ ఉదయం ఖిబ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఏటీఎం మిషన్లో రూ.7.50లక్షలు దాకా నగదు ఉన్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నరసింగప్ప, వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బొలొరో వాహనం గాంధీనగర్, కొత్తపేట సర్కిల్ మీదుగా ఉప్పునేశనపల్లిమీదుగా జాతీయ రహదారివైపు వెళ్లినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ రూట్లో ఉండే సీసీ కెమరాలను పరిశీలిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

