Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరంతర విద్యుత్ సరఫరా: సిఎండి

నిరంతర విద్యుత్ సరఫరా: సిఎండి

వార్త 3 months ago

APCPDCL: వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని పీసీపీడీసిఎల్ సీఎండీ పి.

పుల్లారెడ్డిఆదేశించారు. పీసీపీడీసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి బుధవారం అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూప్టాప్ వ్యవస్థల ఏర్పాటు పీఎం సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.

Read Also: Kamareddy Road Accident:పెళ్లింట రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు

 APCPDCL: Uninterrupted Power Supply: CMD

వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించాలని రెవెన్యూ వసూళ్లు 100 శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫీడర్లను ఎటువంటి బ్రేక్డౌన్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బిల్లింగ్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని నూతనంగా నిర్మాణంలో ఉన్న సబ్స్టేస్టేషన్ల పనుల పురోగతిని వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృగతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సేవలు మెరుగుపడుతున్నాయని, మూడు ప్రశ్నల ఆధారంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీసీపీడీసిఎల్కు 78.1 శాతం సానుకూల స్పందన లభించిందని తెలిపారు. ఈ శాతాన్ని 90 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఆర్డిఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్. మూర్తి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

టెక్నాలజీతో ఆడిన మాయాజాలం: శ్రీనివాస్ కిరణ్ బాబు మోసాల వెనుక అసలు కథ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha