Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

వార్త 3 weeks ago

CM Chandrababu Tour: మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబు సోమవారం రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆధునీకరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Read Also : District : నేడు మూడు జిల్లాల్లో సిఎం పర్యటన

CM : పనుల ప్రారంభం – సీఎం ఆదేశాలు

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిపై కీలక చర్చ జరిపారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అమర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర జల సంఘం (CWC) సూచనల మేరకు, బ్యారేజీలో మిగిలిపోయిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది (2027) జూన్ నెల నాటికి ఈ కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బ్యారేజీని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

పోలవరం, ధవళేశ్వరంపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha