Dailyhunt
ఢిల్లీ అసెంబ్లీ వద్ద హైడ్రామా: గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు

ఢిల్లీ అసెంబ్లీ వద్ద హైడ్రామా: గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు

వార్త 1 week ago

Delhi Assembly: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం భారీ భద్రతా వైఫల్యం కలకలం రేపింది. అత్యంత భద్రత ఉండే ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక గుర్తు తెలియని వాహనం వేగంగా దూసుకువచ్చింది.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేగంగా వచ్చిన కారు అసెంబ్లీ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టడంతో గేటు విరిగిపోయింది. అనంతరం దుండగులు వాహనంతో సహా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

Read Also:Adoni Lorry Fire Accident: బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం.. లారీలో చెలరేగిన మంటలు

Delhi Assembly: ముఖానికి మాస్క్.. మెరుపు వేగంతో దాడి

సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఒక టాటా సియెర్రా స్పీడ్‌గా అసెంబ్లీ వైపు దూసుకొచ్చింది. అక్కడి భద్రతా సిబ్బందిని ఏమార్చుతూ, గేట్ నంబర్ 2ను బలంగా ఢీకొట్టి ఇనుప కంచెలను పగలగొట్టుకుని ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో విఐపి గేట్ వద్ద CRPF సిబ్బంది మోహరించి ఉన్నప్పటికీ, కారు వేగాన్ని అడ్డుకోలేకపోయారు.

 Delhi Assembly Security Breach

కారును లోపలికి పోనిచ్చిన ఆ ముసుగు వ్యక్తి, నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లాడు. అక్కడ వరండా వద్ద కారు ఆపి, ఒక బొకే ఉంచి, ఆపై అంతే వేగంతో కారును వెనక్కి తిప్పి ప్రాంగణం నుండి పారిపోయాడు. ఈ అనూహ్య చర్యతో అక్కడున్న అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, పోలీసులు ఆ పూలగుత్తిని పరిశీలించారు. అయితే, అందులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కాంగ్రెస్‌, పాకిస్థాన్‌ సంబంధం ఇప్పటిది కాదు .. ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha