Dailyhunt
బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం.. లారీలో చెలరేగిన మంటలు

బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం.. లారీలో చెలరేగిన మంటలు

వార్త 1 week ago

Adoni Lorry Fire Accident: కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. నూతనంగా నిర్మించిన బైపాస్ బ్రిడ్జిపై వెళ్తున్న ఒక లారీలో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ఘటనతో అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read also: Bihar SDPO Raid: పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

 Fire accident on the bridge.. Fire broke out in the lorry

అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది

లారీలో మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.

Adoni Lorry Fire Accident: కారణాలు అస్పష్టం

బైపాస్ బ్రిడ్జిపై లారీ వెళ్తుండగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా బైపాస్ రోడ్డులో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha