Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీ ఏఐ సదస్సుకు TGSPDCL 9 మంది ఇంజినీర్లు

ఢిల్లీ ఏఐ సదస్సుకు TGSPDCL 9 మంది ఇంజినీర్లు

వార్త 1 week ago

విSPDCL:విద్యుత్ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై జాతీయ సదస్సుకు TGSPDCL నుంచి తొమ్మిది మంది ఇంజినీర్లు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడం లక్ష్యంగా TGSPDCL కీలక ముందడుగు వేసింది.

ఇందులో భాగంగా, భారత విద్యుత్ రంగాన్ని కృత్రిమ మేధస్సు (AI) ఆధారితంగా తీర్చిదిద్దే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ స్థాయి మేధోమథన సదస్సుకు సంస్థ నుంచి తొమ్మిది మంది ఇంజినీర్లను నామినేట్ చేసింది. న్యూఢిల్లీలోని మాణెక్షా సెంటర్, పరేడ్ రోడ్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో "CEA Brainstorming Event - Making Indian Power Sector AI Enabled" పేరుతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. TGSPDCL సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ దార్శనికతకు అనుగుణంగా ఇంజినీర్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆధునిక డిజిటల్ పరిష్కారాలను విద్యుత్ పంపిణీ కార్యకలాపాల్లో వినియోగించడం వంటి అంశాలకు సంస్థ ప్రాధాన్యత ఇస్తోంది. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సీనియర్, యువ ఇంజినీర్లు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సీఎండీ ఆకాంక్షిస్తున్నారు.

vijaya dairy: విజయ డెయిరీ పాలధరలు పెంపు.. ఎంతంటే?

విద్యుత్ రంగంలో ఏఐతో మెరుగైన సేవలకు అవకాశాలు

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA), కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (CERC), భారత వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య (FICCI), GRID-INDIA, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. విద్యుత్ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న నిర్వహణ పద్ధతులు, ఆధునిక పరిష్కారాలపై చర్చించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలుస్తోంది. ఏఐ, డిజిటల్ టూల్స్‌ను సమర్థంగా వినియోగించడం ద్వారా విద్యుత్ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షించడం, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల్లో సంభవించే వైఫల్యాలను ముందుగానే గుర్తించడం, విద్యుత్ అంతరాయాల నిర్వహణను మెరుగుపరచడం, కార్యకలాపాల సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం, రోజువారీ విధుల్లో ఆటోమేషన్‌ను పెంచడం వంటి అంశాలపై ఇంజినీర్లకు అవగాహన కలగనుంది.

TGSPDCL:సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం

వివిధ విభాగాలకు చెందిన ఇంజినీర్లు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా పొందే పరిజ్ఞానం, ఆలోచనల మార్పిడి సంస్థ కార్యకలాపాల్లో ఆచరణాత్మక మార్పులకు దోహదపడుతుందని TGSPDCL భావిస్తోంది. సదస్సులో నేర్చుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యుత్ పంపిణీ వ్యవస్థలో అన్వయించడం ద్వారా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించడం, క్షేత్రస్థాయి సిబ్బంది పనులను సులభతరం చేయడం సాధ్యమవుతుంది.
ఇంజినీర్లకు నిరంతర అభ్యాసం, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, వినూత్న ఆలోచనలకు అవకాశాలు కల్పిస్తూ, భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే ఆధునిక విద్యుత్ పంపిణీ సంస్థగా TGSPDCLను తీర్చిదిద్దాలన్న సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ దార్శనికతకు ఈ కార్యక్రమం ప్రతిబింబంగా నిలుస్తోంది. తద్వారా సంస్థ పనితీరును మరింత మెరుగుపరిచి, వినియోగదారులకు విశ్వసనీయమైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా TGSPDCL ముందుకు సాగుతోంది.

వివిధ విభాగాల నుంచి తొమ్మిది మంది ఇంజినీర్లు

ఈ సదస్సుకు TGSPDCL నుంచి ఐటీ, ఆపరేషన్స్, స్టోర్స్, టెక్నికల్ విభాగాలకు చెందిన తొమ్మిది మంది ఇంజినీర్లు పాల్గొంటున్నారు.

శ్రీ పి.ఏ. జ్యోతిర్మయి - డివిజనల్ ఇంజినీర్, ఐటీ
శ్రీమతి మాధవి పొతుల - అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, ఐటీ
శ్రీ ఐ. ప్రవీణ్ - అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, టెక్నికల్
శ్రీ ప్రవీణ్ కుమార్ లింగంపల్లి - అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, స్టోర్స్, హైదరాబాద్
శ్రీ శ్రేయాన్ కొంపెల్ల - అసిస్టెంట్ ఇంజినీర్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M)
శ్రీ ఐ. కల్యాణ్ - అసిస్టెంట్ ఇంజినీర్, ఐటీ
శ్రీ ఎం. రాకేష్ కుమార్ - అసిస్టెంట్ ఇంజినీర్, ఐటీ
శ్రీ ఈ. ప్రవీణ్ కుమార్ గౌడ్ - అసిస్టెంట్ ఇంజినీర్, ఐటీ
శ్రీ ఎం. శివశంకర్ - అసిస్టెంట్ ఇంజినీర్, ఐటీ

Epaper: epaper.vaartha.com

యాసంగిలో వరి సాగు చేయొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha