Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ డెయిరీ పాలధరలు పెంపు.. ఎంతంటే?

విజయ డెయిరీ పాలధరలు పెంపు.. ఎంతంటే?

వార్త 1 week ago

Vijaya dairy: రాష్ట్రంలోని విజయ డెయిరీ వినియోగదారులకు షాక్ తగిలింది. విజయ డెయిరీ తన స్టాండర్డ్ పాల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధ లీటరు (500 గ్రాములు) పాల ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచుతున్నట్లు డెయిరీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

KTR: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 15 శాతం కమీషన్‌పై ఆరోపణలు

పెరిగిన ధరల వివరాలు

4.5 శాతం వెన్న పాలు (500 గ్రాములు): ప్రస్తుతం ఉన్న ధర రూ.34 నుంచి రూ.35కి పెరిగింది. 6 శాతం వెన్న పాలు (500 గ్రాములు): ప్రస్తుతం ఉన్న ధర రూ.39 నుంచి రూ.40కి చేరింది. ఈ పెరిగిన సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని విజయ డెయిరీ జనరల్ మేనేజర్ వెల్లడించారు. వినియోగదారులు, ఏజెంట్లు ఈ మార్పును గమనించాలని సూచించారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణలో కరెంట్ కష్టాలు..రేవంత్ సర్కారుపై హరీశ్ రావు విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha