Delhi High Court: ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణలో చోటుచేసుకున్న ఈ అవాంఛనీయ ఘటన న్యాయ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. సైబర్ నేరగాళ్ల తెగింపునకు ఇది పరాకాష్టగా నిలిచింది.
Read Also:Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Delhi High Court: విచారణలో షాకింగ్ దృశ్యాలు
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజాస్ కరియాల ధర్మాసనం ఒక కేసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తుండగా మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి. ఆందోళనకు గురైన అధికారులు విచారణను వెంటనే నిలిపివేశారు. తిరిగి విచారణ చేపట్టినప్పటికీ మరో రెండుసార్లు అలాగే అశ్లీల వీడియోలు కనిపించాయి. ఆ తర్వాత “మీరు హ్యాక్ అయ్యారు” అనే సందేశం కనిపించింది.
Delhi High Court Virtual Hearing Hacked
దీంతో వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసు నమోదయ్యింది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విచారణ చేపట్టింది. హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్‌ఫేస్‌పై సైబర్ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ విచారణలోకి గుర్తుతెలియని వ్యక్తి లాగిన్ అయ్యి.. అశ్లీల వీడియోలను ప్లే చేసినట్లు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

