Dailyhunt
ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు.. సొంత ఇళ్లలోనే బాంబుల తయారీ!

ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ నిజాలు.. సొంత ఇళ్లలోనే బాంబుల తయారీ!

వార్త 5 days ago

Delhi Blasts Case updates: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తులో జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) తాజాగా సంచలన విషయాలను బయటపెట్టింది.

ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాల కోసం సరిహద్దుల అవతలి వ్యక్తులపై ఆధారపడకుండా తమ సొంత ఇళ్లలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Read also: Anudeep Arrested: పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు… అనుదీప్ అరెస్ట్

 Shocking facts in the Delhi blasts case.. Making bombs in one’s own homes!

ఉగ్రవాదులుగా మారిన ఐదుగురు డాక్టర్లు

ముఖ్యంగా ఈ నెట్‌వర్క్‌లో ఐదుగురు డాక్టర్లు కీలక పాత్ర పోషించడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరో నలుగురు వైద్యులు తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇళ్లు, లాబొరేటరీల్లోనే పేలుడు పరికరాలను సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. శ్రీనగర్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం 10 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.

Delhi Blasts Case updates: ప్రమాదకరమైన TATP కెమికల్ వినియోగం

ఈ దాడుల కోసం నిందితులు ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) అనే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని వినియోగించారు. సాధారణంగా మార్కెట్లో లభించే కెమికల్స్‌తోనే దీన్ని సులువుగా తయారు చేయవచ్చని, దీనికి నిర్దిష్టమైన వాసన లేకపోవడం వల్ల భద్రతా తనిఖీల్లో గుర్తించడం కష్టమని దర్యాప్తు సంస్థ పేర్కొంది. గతంలో పేలుడు పదార్థాలను రహస్యంగా తెప్పించుకునే ఉగ్ర నెట్‌వర్క్‌లు ఇప్పుడు స్వయంగా బాంబులను తయారు చేసుకోవడం దేశ భద్రతకు కొత్త సవాలుగా మారింది.

దేశ భద్రతకు కొత్త సవాలు

తయారు చేసే సమయంలోనే పేలుడు సంభవించే ప్రమాదం ఉన్నప్పటికీ నిందితులు ఈ అత్యంత రిస్క్‌తో కూడిన పద్ధతిని ఎంచుకోవడం కలకలం రేపుతోంది. గతంలో కశ్మీర్‌లోని ఉగ్ర నెట్‌వర్క్‌లు పేలుడు పదార్థాలను సరిహద్దుల నుంచి అక్రమంగా తరలించేవని, కానీ ఇప్పుడు నిందితులు తమ ఇళ్లనే బాంబుల తయారీ కేంద్రాలుగా మార్చుకోవడం భద్రతా పరంగా పెను ఆందోళనకు దారితీస్తోందని ఎస్ఐఏ తన నివేదికలో స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జెస్సికా మృతి కేసులో సంచలన మలుపు.. సీసీ కెమెరాల డైరెక్షన్ మార్చి మరీ ప్లాన్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha