Tim David Gully Cricket: ఐపీఎల్ 2026 సందడి మైదానంలోనే కాదు, బయట కూడా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యపరిచారు.
Read Also: IPL 2026 : వివాదంలో KKR బ్యాటర్ రఘువంశీ
Tim David Gully Cricket: గల్లీ క్రికెట్‌లో విదేశీ స్టార్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ చేరుకున్న ఆర్‌సీబీ జట్టులో విదేశీ ఆటగాళ్లు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ సరదాగా బయటకు వెళ్లారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో షికార్లు చేస్తున్న సమయంలో వారికి కొందరు పిల్లలు గల్లీ క్రికెట్ ఆడుతూ కనిపించారు.మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ ఇద్దరు హిట్టర్లు, గల్లీ క్రికెట్‌ను చూడగానే ఆగలేకపోయారు. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు.
మొదట టిమ్ డేవిడ్ గల్లీ బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయగా, ఆ తర్వాత రొమారియో షెఫర్డ్ కూడా తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని గల్లీ క్రికెట్‌లో ప్రదర్శించాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనే ఈ స్టార్లు, చిన్న పిల్లల బౌలింగ్‌లో ఆడుతుంటే అక్కడున్న వారు సంబరపడిపోయారు.ఈ ఇద్దరు విదేశీ ప్లేయర్లు సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మొహ్సిన్ ఖాన్ పంజా.. కుప్పకూలిన కేకేఆర్

