Delhi Weather Update: తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలకు వాతావరణం చల్లబడి భారీ ఉపశమనం లభించింది. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
మరోవైపు, భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి జూన్ 6 వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
Read also: Another Trinamool Mayor Quits : తృణమూల్ మేయర్ రాజీనామా..మమతాకు గట్టి షాక్
Heavy rain accompanied by thunder and lightning in several parts of Delhi-NCR
Delhi Weather Update: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురు గాలులు.. వడగళ్ల వాన ముప్పు!
రాబోయే కొద్ది గంటల్లో నగరవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వడగళ్ల వాన పడే అవకాశం కూడా ఉందని ఐఎమ్‌డి హెచ్చరించింది.
ఈ వాతావరణ సూచన సెంట్రల్, ఈస్ట్, న్యూ ఢిల్లీ, నార్త్, నార్త్-ఈస్ట్, నార్త్-వెస్ట్, షాదారా, సౌత్, సౌత్-ఈస్ట్, సౌత్-వెస్ట్, వెస్ట్ ఢిల్లీతో సహా నగరంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ‘చాలా ఎక్కువగా’ ఉన్నందున, ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని నివాసితులకు అధికారులు సూచించారు.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
దేశవ్యాప్తంగా వర్ష కాలం ప్రారంభాన్ని సూచిస్తూ.. గురువారం (జూన్ 4, 2026) కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎమ్‌డి అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా వచ్చాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్ దీవులు, కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు మరియు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. అంతకుముందు మే 26నే ఇవి కేరళకు చేరుకుంటాయని అంచనా వేసినప్పటికీ, వాతావరణ పరిస్థితుల వల్ల రాక ఆలస్యమైంది.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం!
ఈ సంవత్సరం భారతదేశంలో కాలానుగుణ వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తన అంచనాను సవరించింది. దేశంలో ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాల సగటు (LPA)లో సుమారు 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఎల్‌పీఏ (LPA) అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో 30 నుండి 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నమోదైన వర్షపాతం సగటును లెక్కిస్తారు. ఈసారి వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

