National Highways Expansion: కేంద్ర నిర్ణయం తీసుకుంది.రూ.7,597.16 కోట్ల వ్యయ అంచనాలతో మొత్తం 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల పనులకు ఆమోదం ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి అత్యంత కీలక తెలిపారు.
కేంద్ర మంత్రి మండలి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం అయింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను తెలియచేశారు. కేంద్ర కేబినెట్ ద్వారా ఇంతకు ముందు ఎప్పుడూ లేని రీతిలో ఇప్పుడు ఈ హై ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం దక్కింది. ఇప్పుడు ఆమోదించిన పనులలో రెండు రహదారులు ఏర్పాటు అవుతాయి. మొదటిది ఎన్కౌచ్-63 పరిధిలోని ఆర్మూర్-జగిత్యాల- మంచిర్యాల సెక్షన్ రహదారి విస్తరణ హైబ్రిడ్ అన్యూటి మాడల్ (హామ్) పద్ధతిలో నిర్మిస్తారు. ఇక, రెండోది ఎన్హెచ్- 563 సంబంధిత జగిత్యాల-కరీంనగర్ సెక్షన్ రహదారిని బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ ఫర్ ప్రాతిదికన కాంట్రాక్టుకు ఇస్తారు. నాలుగే లేన్ల ప్రామాణిక మార్గంగా దీనిని మారుస్తారు.
Read also: Ponguleti Srinivas Reddy : తెలంగాణలో రేపటినుంచి అమల్లోకి భూముల కొత్త ధరలు
Union Cabinet gives green signal for expansion of national highways in Telangana
National Highways Expansion: ఉత్తర తెలంగాణకు ప్రయాణ సౌలభ్యం – రద్దీ ప్రాంతాలకు విముక్తి
ఈ రహదార్ల ఏర్పాటు క్రమంలో మునుపటి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, కొంత మేరకు నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపాదించిన ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాజెక్టు సెక్షన్ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా సాగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో హైవే వెంబడి విసృత జనసంచారం, రద్దీ వ్యాపార సముదాయాలు ప్రాంతాలు ఉండటంతో ఇరుకైన దారిలో సాగాల్సి వస్తోంది ఈ మార్గంలో అంకుశాపూర్, కోరుట్ల, ధర్మపురి, లక్సేటిపేట, మంచిర్యాల, జగిత్యాల్ వంటి ప్రాంతాలు ఉండటంతో ప్రయాణ ఇక్కట్లు తలెత్తతున్నాయి. ఇదే విధంగా జగిత్యాల కరీంనగర్ సెక్షన్ కూడా పలు రద్దీ ప్రాంతాల మీదుగా వెళ్లుతుంది. జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్లలో ఇటీవలి కాలంలో విపరీత స్థాయిలో ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ డిమాండ్ను ఇప్పటి రోడ్లు సరైన విధంగా తీర్చలేకపోతున్నాయి.
ప్రయాణ సమయం ఆదా – ఆర్థిక వాణిజ్య కార్యకలాపాల వృద్ధి
పూర్తి స్థాయి సమీక్షలు విశ్లేషణల తరువాత ఈ రెండు సెక్షన్ల విస్తరణ, నాలుగు లేన్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రం అధికారిక ప్రకటనలో తెలిపారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణ సామర్థం, సంబంధిత పలు జిల్లాల్లో ప్రయాణ సమర్థత మరింత మెరుగుపడేలా చేసేందుకు ఈ ప్రాజెక్టులను తలపెట్టారని వెల్లడించారు. ఓపెన్ టోల్, స్పీడ్ సక్రమ నిర్వహణ వంటివి ఫక్కాగా కుదిరేందుకు వీలేర్పడుతుంది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. మరో వైపు ఈ మార్గంలో మహారాష్ట్ర, గుజరాత్ వంటి దూర ప్రాంతాలకు వేగంగా వెళ్లేందుకు వీలేర్పడుతుంది.
పైగా జిల్లాలోని మారుమూల అనుసందాన రూట్లలో కూడా ప్రయాణ సౌకర్యానికి అనుసంధాన మార్గాల ఏర్పాటుకు వీలేర్పడుతంది. ప్రాంతీయ స్థాయిలో రవాణా సౌకర్యం పెరగడంతో ఈ ప్రాంతంలోని ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలకు, సామాజిక సానుకూలతకు దారితీస్తుందని ప్రకటనలో తెలిపారు. పనుల శంకుస్థాపన, నిర్మాణ పనులు చేపట్టిన తరువాత రెండున్నర నుంచి మూడేండ్లలోపు ఈ విస్తారిత రాదార్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టులు రెండు సంపూర్తి అయితే ఈ ప్రాంతాల్లో వారికి రవాణా సమయం దాదాపుగా గంటన్నర వరకూ ఆదా అవుతుంది. ఆర్మూర్, మంచిర్యాల మధ్య వెళ్లే వారికి గంటన్నర కలిసి వస్తుంది.
దేశవ్యాప్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
కాగా జగిత్యాల, కరీంనగర్ మధ్య వెళ్లే వారికి దాదాపు ముప్పావు గంట ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ క్రమంలో వారికి ఎక్కువగా రవాణా సౌకర్యాలు ఏర్పడటంతో పాటు వ్యాపార రంగం వృద్ధికి వీలేర్పడుతుందని ఆశిస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కోసం రూ.39,290 కోట్ల పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం ఆరు ముఖ్యమైన ప్రతిపాదనలను ఈ సమావేశంలో ఆమోదించారు. దేశవ్యాప్తంగా మోలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి పలు రాష్ట్రాల్లో జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆమోదించింది. రామేశ్వరంకోణార్క్పిరాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్ట్ను ఆమోదించగా.. ఇందుకు రూ.8,301 కోట్లు ఖర్చు చేయనుంది.
దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో అనుసంధానాన్ని ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. ఇక బీహార్ లోని ఖగారియాపూర్నియా సెక్షన్ను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు రూ.3,936 కోట్లు ఆమోదించారు. మధ్యప్రదేశ్లో ఎన్హాచ్-347బి అప్డ్ కోసం రూ.4,415 కోట్ల పెట్టుబడిని కూడా ఆమోదించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వాహనాల కొనుగోలుపై 100 శాతం మోటారు వాహన పన్ను మినహాయింపు రిజిస్ట్రేషన్ ఫీజులో ఉపశమనాన్ని కూడా అందిస్తాయి. అయితే ఈ ప్రయోజనం తమ పాత వాహనాలను స్క్రాప్ చేసే లేదా వాటిని ఎన్సీఏపీ యేతర నగరాలకు తరలించే వాహన యజమానులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

