Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో భారీ బందోబస్తు

ఢిల్లీలో భారీ బందోబస్తు

వార్త 1 week ago

Cockroach Janta Party Protest : దేశ రాజధాని న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ ఆందోళనల్లో స్వయంగా పాల్గొనేందుకు గాను ఆ పార్టీ వ్యవస్థాపకుడు (Founder) అభిజీత్ దిప్కే అమెరికా (US) నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి చేరుకున్నారు.

ఆయన రాకతో నిరసనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు నగరవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రదర్శనలు జరిగే పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును మోహరించారు. నిరసన కారులను నియంత్రించేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించారు.

Read Also : కర్ణాటకలో ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి

అనుమతి ఉందా? లేదా? సీజేపీ వర్సెస్ ఢిల్లీ పోలీస్ వివాదం

ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన అనుమతులపై ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి, ఢిల్లీ పోలీసులకు మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేపట్టేందుకు తమకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతి ఇచ్చారని సీజేపీ వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. అంతేకాకుండా, ఈ ప్రదర్శనలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చాయి. అయితే, దీనికి భిన్నంగా ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఈ నిరసనలకు సంబంధించి తమకు అసలు ఎలాంటి విజ్ఞప్తి లేదా దరఖాస్తు రాలేదని, వీటికి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. ఈ విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

TMC నేతపై దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha