TMC Jayaprakash : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకులకు 'గుడ్ల దాడులు' తీవ్ర తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై కొందరు దుండగులు గుడ్లతో దాడి చేసిన ఘటన మరువకముందే..
తాజాగా మరో సీనియర్ నేతకు అదే చేదు అనుభవం ఎదురైంది. ల్యాండ్ గ్రాబింగ్ (ఆస్తి ఆక్రమణ) కేసులో ఇటీవల అరెస్ట్ అయిన టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్‌పై కోల్‌కతా వీధుల్లో కొందరు ఆగ్రహంతో గుడ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. వివాదాస్పదంగా మారిన సదరు ప్రాపర్టీని స్వయంగా పరిశీలించేందుకు గాను, కోర్టు అనుమతితో పోలీసులు జయప్రకాశ్ మజుందార్‌ను ఘటనా స్థలానికి రక్షిత వాహనంలో తీసుకువచ్చారు. ఆయన కారు దిగి ముందుకు వెళ్తున్న క్రమంలో అక్కడే పొంచి ఉన్న కొందరు ఒక్కసారిగా గుడ్లతో దాడి చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ వాతావరణం నెలకొంది.
Read Also : అన్నామలై కోసం ఏదైనా చేసేవాణ్ని - పవన్
కారు దిగేందుకు నేత నిరాకరణ.. భద్రతపై ఆందోళన
ఈ ఆకస్మిక దాడితో జయప్రకాశ్ మజుందార్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను రక్షించి తిరిగి కారులోకి చేర్చారు. అయితే, పోలీసుల భద్రతా వలయంలోనే తనపై ఇలాంటి దాడి జరగడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. తనకు సరైన రక్షణ లేదని, ఇకపై తాను కారు దిగే ప్రసక్తే లేదంటూ పోలీసుల ముందే భీష్మించుకుని కూర్చున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ నేతలపై వరుసగా జరుగుతున్న ఈ గుడ్ల దాడుల పరంపర వెనుక విపక్షాల హస్తం ఉందా, లేక భూవివాద బాధితుల పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ, శాంతిభద్రతల పరిరక్షణలో కోల్‌కతా పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలకు ఈ తాజా ఉదంతం మరింత ఆజ్యం పోసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

