Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో ఏకంగా 7.7 లక్షల రేషన్ కార్డులు రద్దు

ఢిల్లీలో ఏకంగా 7.7 లక్షల రేషన్ కార్డులు రద్దు

వార్త 3 months ago

Chief Minister Rekha Gupta: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనర్హులుగా ఉన్న సుమారు 7.72 లక్షల రేషన్ కార్డులు (ration cards) ను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారికంగా ప్రకటించారు. రేషన్ పంపిణీ వ్యవస్థపై నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ రద్దు వల్ల ఏర్పడిన ఖాళీల ఆధారంగా.. నిజమైన పేదలకు మేలు చేసేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ 7.7 లక్షల కార్డులు ఎందుకు రద్దయ్యాయి? ప్రభుత్వం చేసిన పూర్తిస్థాయి ఆడిట్‌లో దాదాపు 7,71,384 మంది అర్హత లేని, బోగస్ లబ్ధిదారులను గుర్తించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: India Cyprus Relations: వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి భారత్-సైప్రస్ బంధం

 Chief Minister Rekha Gupta

Chief Minister Rekha Gupta: ఆదాయ పరిమితి దాటినవారు

రద్దయిన కార్డుల్లో అత్యధికంగా 6,46,123 మంది నిర్దేశిత ఆదాయ పరిమితి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తేలింది. ఏడాదిగా రేషన్ తీసుకోనివారు: దాదాపు 95,682 మంది లబ్ధిదారులు గత ఒక సంవత్సరం నుండి అసలు రేషనే తీసుకోలేదు. చనిపోయిన వారి పేరిట: సుమారు 6,185 మంది చనిపోయినప్పటికీ, వారి రికార్డులపై ఇంకా రేషన్ డ్రా చేస్తూనే ఉన్నారు. రెండు చోట్ల లబ్ధి: మరో 23,394 మంది లబ్ధిదారులు వేర్వేరు ప్రాంతాల నుండి రెండు బహుళ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్! ఢిల్లీలో గత 13 ఏళ్లుగా కొత్తగా ఎలాంటి రేషన్ కార్డులు (ration cards) జారీ చేయలేదు. కానీ, ఇప్పుడు బోగస్ కార్డుల ఏరివేత తర్వాత కొత్త కార్డుల జారీకి మార్గం సుగమమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నీట్ పరీక్షపై ఎన్‌టీఏ క్లారిటీ.. పూర్తి పేపర్ లీక్ కాదట

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha