Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పరీక్షపై ఎన్‌టీఏ క్లారిటీ.. పూర్తి పేపర్ లీక్ కాదట

నీట్ పరీక్షపై ఎన్‌టీఏ క్లారిటీ.. పూర్తి పేపర్ లీక్ కాదట

వార్త 2 days ago

NEET UG 2026 : నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ పూర్తిగా లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని, దీనిని పూర్తి స్థాయి పేపర్ లీక్‌గా పరిగణించలేమని ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు.

ఇటీవల నీట్ పరీక్షపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు అధికారులు ఈ వివరణ ఇచ్చారు.

ఎన్‌టీఏ కీలక వివరణ

పరీక్షలో అవకతవకలు జరిగిన విషయం నిజమేనని, అయితే తమ వ్యవస్థ నుంచి పేపర్ లీక్ కాలేదని ఎన్‌టీఏ అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకే పరీక్షను రద్దు చేసినట్లు తెలిపారు. సీబీఐ దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు బాధ్యులు ఎవరో తేలుతుందని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఎన్‌టీఏ చీఫ్ అభిషేక్ సింగ్ కమిటీకి వివరించారు.

ఎంపీల నుంచి కీలక సూచనలు

పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీలు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించారు. ఎన్‌టీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. భవిష్యత్తులో ఒక్కో రాష్ట్రానికి వేర్వేరు ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలని కూడా కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీ చైర్‌పర్సన్ దిగ్విజయ్ సింగ్ సమావేశం సానుకూలంగా జరిగిందని తెలిపారు.

Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత

 NEET UG 2026

సీబీఐ దర్యాప్తు, రీ-ఎగ్జామ్

ఈ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో 9 మందిని అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల అరెస్ట్ దర్యాప్తులో కీలకంగా మారింది. ఇదిలా ఉండగా, రద్దు చేసిన నీట్-యూజీ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించింది. అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నిన్న ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha