CNG Price Hike: దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను కిలోకు మరో రూ. 2 పెంచుతున్నట్లు గ్యాస్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి.
ఈ తాజా పెంపుతో ఢిల్లీ నగరంలో కిలో సీఎన్‌జీ ధర రూ. 83.09 మార్కుకు చేరింది. కాగా, ప్రస్తుత మే నెల 15వ తేదీ నుంచి ఇప్పటివరకు గడిచిన 11 రోజుల్లోనే సీఎన్‌జీ రేట్లు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
11 రోజుల్లో రూ. 6 మేర పెరిగిన రేట్లు
గత 11 రోజుల వ్యవధిని పరిశీలిస్తే సీఎన్‌జీ ధర ఏకంగా కిలోకు రూ. 6 మేర పెరిగింది. మే 15న రూ. 2, మే 18న రూ. 1, మే 23న మరో రూపాయి చొప్పున ధరలను పెంచుకుంటూ వచ్చారు. ఈ తాజా పెంపుతో ఢిల్లీ పరిసర ప్రాంతాలలో (NCR) రేట్లు ఇలా ఉన్నాయి.నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్‌జీ రేట్లు మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర ఏకంగా రూ. 88.70 పలుకుతోంది. న గురుగ్రామ్‌లో కూడా ఇంధన తాజా పెంపుతో అక్కడ కిలో సీఎన్‌జీ ధర రూ. 86.12 కి చేరింది. ముంబైలో ప్రస్తుతం కిలో సీఎన్‌జీ రేటు రూ. 84.00 వద్ద కొనసాగుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతోంది.
delhi cng price hike
Read also: Narendra Modi: నేడు ప్రధాని మోదీతో కేరళ ముఖ్యమంత్రి భేటీ!
CNG Price Hike: అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణం.. నిత్యావసరాలపై ప్రభావం
ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వద్ద చమురు, సహజ వాయువు సరఫరా గొలుసు దెబ్బతినడమే ఈ వరుస ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల బడ్జెట్‌ను కూడా దెబ్బతీస్తోంది. సీఎన్‌జీ రేట్లు పెరగడంతో ఆటోలు, క్యాబ్‌ల రవాణా చార్జీలు భారీగా పెరిగి, పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేందుకు దారితీస్తోంది.
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కూడా భారమే!
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 95.20గా ఉంది. వీటికి తోడు ఈ నెల ప్రారంభంలోనే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా ఏకంగా రూ. 3,071.50కి చేరడంతో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా ప్రియమయ్యాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో, అంతర్జాతీయ పరిణామాల వల్ల పెరిగే ఈ ధరలను దేశీయంగా నియంత్రించడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also hindi news: hindi.vaartha.com
Read also:

