Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు ప్రధాని మోదీతో కేరళ ముఖ్యమంత్రి భేటీ!

నేడు ప్రధాని మోదీతో కేరళ ముఖ్యమంత్రి భేటీ!

వార్త 2 weeks ago

Narendra Modi: కేరళ నూతన ముఖ్యమంత్రి వీడీ సతీశన్ మంగళవారం (మే 26) న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో జరగబోతున్న తొలి అధికారిక భేటీ ఇదే కావడం విశేషం.

ఈ కారణంగానే ఈ సమావేశంపై దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర అభివృద్ధి, నిధులపైనే ప్రధాన చర్చ

ప్రధానితో జరిగే భేటీలో చర్చించబోయే అంశాల అజెండాను అధికారికంగా వెల్లడించనప్పటికీ, కేరళ ఆర్థిక పరిస్థితిపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి కేరళకు అందాల్సిన ఆర్థిక ప్యాకేజీలు,రాష్ట్ర పరిధిలోని ఇతర కీలక సమస్యలపై ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం, మధ్యాహ్నం 2:30 గంటలకు కర్తవ్య భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా ముఖ్యమంత్రి సతీశన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

 Kerala Chief Minister to meet PM Modi today

Read also: House Rents: ముంబైలో ఆదాయానికి మించి పెరిగినా ఇంటి అద్దెలు

కేరళ హౌస్‌లో ఘన స్వాగతం.. కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి దేశ రాజధానికి విచ్చేసిన వీడీ సతీశన్‌కు ఢిల్లీలోని కేరళ హౌస్‌లో విద్యార్థులు, పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. కాగా, ప్రధానిని కలవడానికి ముందే శనివారం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరియు కేసీ వేణుగోపాల్ సహా పలువురు అగ్రనేతలను కలిసి రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

Narendra Modi: యూడీఎఫ్ ఘన విజయం.. మే 18న ప్రమాణ స్వీకారం

ఇటీవల ముగిసిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరుగులేని మెజారిటీ సాధించింది. మొత్తం స్థానాల్లో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 సీట్లు గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకోగా, గత అధికార వామపక్ష (LDF) కూటమి కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఈ ఘన విజయం తర్వాత మే 18న వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా, ఆయనతో పాటు మరో 20 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also hindi news: hindi.vaartha.com

Read also:

ముంబైలో ఆదాయానికి మించి పెరిగినా ఇంటి అద్దెలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha