Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"ధోనీ మార్క్ నిస్వార్థం" - సంజు శాంసన్ ఆటపై సునీల్ గవాస్కర్ క్రేజీ కామెంట్స్

"ధోనీ మార్క్ నిస్వార్థం" - సంజు శాంసన్ ఆటపై సునీల్ గవాస్కర్ క్రేజీ కామెంట్స్

వార్త 1 month ago

Sanju Samson: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఒక క్లాసిక్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

ఎంఎస్ ధోనీ లేని లోటును భర్తీ చేస్తూ, మిడిల్ ఆర్డర్‌లో జట్టు బాధ్యతను భుజాన వేసుకున్న సంజు.. తన ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ అందరి మనసు గెలుచుకున్నాడు.కార్తీక్ శర్మతో కలిసి ఆయన నెలకొల్పిన 114 పరుగుల అజేయ భాగస్వామ్యం సీఎస్కేకు ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని అందించింది.

Read Also:Ruturaj Gaikwad: ఢిల్లీపై 'సూపర్' విక్టరీ: సంజూ శాంసన్‌పై కెప్టెన్ రుతురాజ్ ప్రశంసల జల్లు..

 Sunil Gavaskar on Sanju Samson

Sanju Samson: గవాస్కర్, సెహ్వాగ్ ప్రశంసల జల్లు

సంజు శాంసన్ ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.

  • సునీల్ గవాస్కర్: “ఓపిక ఎప్పుడూ గొప్ప ఫలితాలను ఇస్తుంది. సంజు శాంసన్ ముందుగా పరిస్థితులను అర్థం చేసుకుని, ఆ తర్వాత విరుచుకుపడ్డారు. కార్తీక్ శర్మ వేగంగా మ్యాచ్ ముగించకపోయి ఉంటే శాంసన్‌కు ఖచ్చితంగా సెంచరీ వచ్చేది, కానీ అతను జట్టు కోసమే ఆడాడు.”
  • వీరేందర్ సెహ్వాగ్: “గత కొన్ని ఏళ్లుగా శాంసన్ ఆటలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అతను కేవలం తన జోన్‌లో ఉన్న బంతులను మాత్రమే అటాక్ చేస్తూ ‘పర్సంటేజ్ క్రికెట్’ ఆడుతున్నాడు.”

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

"మా హక్కుల కోసం పోరాడతాం" - ప్రైజ్ మనీ పెంపుపై సబలెంకా ఘాటు వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha