Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

వార్త 1 week ago

Dhurandhar 2 OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ , సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ' ధురంధర్ 2 ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Read Also: Anasuya Bharadwaj First Look: అనసూయ 'నాగబంధం' లుక్ విడుదల.. జూలై 3న థియేటర్లలోకి

 ‘Dhurandhar 2’ OTT release date fixed?

Dhurandhar 2 OTT Release Date: జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

అయితే, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఓటీటీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 14-15 తేదీల నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అయితే, భారతదేశంలోని ప్రేక్షకుల కోసం జూన్ 4వ తేదీ రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని సమాచారం. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు జూన్ మొదటి వారం నుంచి ఇంటి వద్దే ఈ హై-వోల్టేజ్ రివేంజ్ డ్రామాను ఆస్వాదించవచ్చు.

'ధురంధర్ 2' చిత్రంలో రణ్‌వీర్ సింగ్ తనదైన మార్క్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డు వ్యూస్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

'కాళిదాస్ 2'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha