Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీఎస్పీ భీం రెడ్డి అరెస్ట్.. 300 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు!

డీఎస్పీ భీం రెడ్డి అరెస్ట్.. 300 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు!

వార్త 3 weeks ago

DSP Bheem Reddy Assets:హైదరాబాద్ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ భీం రెడ్డి అక్రమ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో జరిపిన తనిఖీలలో డీఎస్పీ భీం రెడ్డి ఆస్తులు 300 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండితో పాటు 43.6 లక్షల నగదు బయటపడింది. అంతేకాకుండా ఇంట్లో 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను, డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్ గూడ జైలులో ఉంచారు.

Read also: Chikkaballapur Road Accident: లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు.. డ్రైవర్‌తో సహా ఇద్దరు మృతి!

 DSP Bheem Reddy assets investigation

లగ్జరీ విల్లాలు బహుళ ప్రాంతాల్లో భూములు

భీం రెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తుల జాబితా చూస్తే అధికారులే విస్తుపోయారు. గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఆయనకు విలువైన ప్లాట్లు ఉన్నాయని తేలింది. ఇబ్రహీం బాగ్ ఏరియాలో ఒక భారీ లగ్జరీ విల్లాను కూడా ఆయన నిర్మించుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో వందల ఎకరాల వ్యవసాయ భూములు ఆయన పేరు మీద ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగుచూసింది. సోదాల సమయంలో దొరికిన ఒక రహస్య డైరీ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. ఇందులో ఆయన చేసిన భూ లావాదేవీలు, సెటిల్మెంట్ల వివరాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ డైరీలోని సమాచారాన్ని బట్టి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

DSP Bheem Reddy Assets:బినామీల పేరిట భారీగా ఆస్తుల కూడబెట్టిన వైనం

ఈ అవినీతి కేసులో 15 మంది బినామీల పేర్లు బయటపడ్డాయి. గతంలో భీం రెడ్డి వద్ద పనిచేసిన మాజీ హోంగార్డ్, వాచ్ మెన్ వంటి వారి పేర్ల మీద కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ త్వరలోనే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. కోర్టు అనుమతితో త్వరలోనే భీం రెడ్డి లాకర్లను తెరవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూ సెటిల్మెంట్లు చేసినట్లు వస్తున్న ఆరోపణల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని లెక్క తేల్చే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన విద్యార్థిని దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha