YS Jagan: టీచర్ పోస్టుల భర్తీ (DSC) ప్రక్రియలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన బాట పట్టిన అభ్యర్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.
బాధితుల పక్షాన నిలబడి వారికి అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని, కోర్టు ఖర్చులన్నింటినీ తమ పార్టీయే భరిస్తుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

డీఎస్సీ అక్రమాలపై ప్రత్యేక కమిషన్.. సీబీఐ విచారణకు డిమాండ్
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశామని జగన్ గుర్తుచేశారు. భవిష్యత్తులో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవకతవకలపై సమగ్ర రీ-ఎంక్వైరీ చేయిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు, కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
Read also:Telangana: తెలంగాణ మా అయ్యల జాగీరు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్
YS Jagan: క్రీడా కోటా నియామకాల్లో పారదర్శకత శూన్యం: చంద్రబాబుపై విమర్శలు
స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని జగన్ తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు కట్టబెట్టేలా ప్రభుత్వం జీవో తీసుకురావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థం ఉందని ఆరోపించారు. తనకు కావలసిన వారికి లబ్ధి చేకూర్చడానికే ఈ దొడ్డిదారిని తెరిచారని మండిపడ్డారు. అనుకున్న వారికి ఉద్యోగాల భర్తీ పూర్తి కాగానే, పాత ఉత్తర్వులను మార్చేసి మళ్లీ కొత్త జీవోను ఎందుకు తెచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫస్ట్ ర్యాంకర్లకే ఉద్యోగాలు లేవు.. అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం
ప్రస్తుత డీఎస్సీలో పేపర్ లీకేజీల దగ్గర నుంచి అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు దక్కలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు (Certificate Verification) హాజరుకాలేదనే నెపంతో టాపర్లను పక్కన పెట్టామని ప్రభుత్వం చెబుతోందని.. మరి అదే అభ్యర్థులు న్యాయం కోసం కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించడంలో అధికారుల తీరులో తీవ్ర లెక్కలేనితనం కనిపిస్తోందని దుయ్యబట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

