AP DSC:డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ప్రతి దశను సాంకేతిక ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించామని, అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ నుంచి పోస్టు ఎంపిక వరకు ఎటువంటి వ్యక్తిగత సంప్రదింపులు లేకుండానే ప్రక్రియ పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణితో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ డిఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను నోటిఫై చేయగా, అందులో 3శాతం క్రీడా కోటా కింది 421పోస్టులను కేటాయించినట్లు తెలిపారు.
Read also: Apspdcl Video Conference: పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్
Transparency in DSC Sports Quota
AP DSC:నియామక ప్రక్రియలో సాంకేతికత
ఈ నియామక ప్రక్రియలో 3,600మంది అభ్యర్థులు మొత్తం 5,326 దరఖాస్తులు సమర్పించగా తుది ఎంపికలో 382పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, ఇంకా 39పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని వెల్లడించారు. అన్ని పోస్తులు భర్తీ కాకపోవడమే ఎంపికలు పూర్తిగా అర్హత, ప్రాధాన్యత, ప్రభుత్వ నిబంధనల ఆధారంగానే నిర్వహించబడినట్లు స్పష్టం చేస్తుందన్నారు. డిఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల మొత్తం ప్రక్రిను ఎటువంటి రాజకీయ జోక్యం మధ్యవర్తుల ప్రమేయం, బాహ్య ప్రభావం లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర క్రీడా విధానం, క్రీడా దృవపత్రాలు, ప్రాధాన్యత క్రమం, అర్హతలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే 382 మంది అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. సార్థక్ పీడీఎస్ పథకంతో కొత్త మార్పులు

