Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్

పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్

వార్త 2 months ago

ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి

Apspdcl Video Conference: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనునట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also : Pawan Kalyan Media Meeting: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కనీసం ప్రెస్‌మీట్‌కైనా అనుమతిస్తారా?.. పవన్ కల్యాణ్

 Video conference tomorrow on industrial power issues

Apspdcl Video Conference: వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనదలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మొబైల్ నంబరు: 8977779471కు కాల్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ సమస్యపై చర్చించి, పరిష్కరించుకునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును సంబంధిత వినియోగదారులకు పంపడం జరిగిందని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుమల సర్వదర్శనం భక్తులకు 'రీ ఎంట్రీ' బంపర్ ఆఫర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha