మహానాడు విజయవంతం కావడo చూసి ఓర్వలేకనే: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra Comments: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు, మహానాడు విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ పై ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
ఆదివారం ఒంగోలులో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి హాజరైన అనంతరం టిడిపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని మంత్రి తెలిపారు. సుమారు 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు హైబ్రిడ్ విధానంలో పాల్గొని 21 కీలక తీర్మానాలకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. మహానాడుకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
Minister Kollu Ravindra’s Criticisms
ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుండటమే ప్రతిపక్షాలకు అసహనంగా మారిందన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదని, నిరుద్యోగ యువతను పూర్తిగా నిరాశపరిచారని మంత్రి ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రక్రియను అడ్డుకునేందుకు అనేక కోర్టు కేసులు పెట్టినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా నియామకాలు పూర్తి చేసిందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది యువతకు కూటమి ప్రభుత్వం న్యాయం చేసిందని పేర్కొన్నారు. జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం వాటి వివరాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే డీఎస్సీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు.
మహానాడు సక్సెస్ చూసి భయం
ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలపై చర్చించకుండా రాజకీయ విమర్శలకు పరిమితం కావడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడులో కీలక తీర్మానం చేసినప్పటికీ ప్రతిపక్షం స్వాగతించలేకపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ వంటి సూపర్ సిక్స్ హామీల అమలులో ముందుకు సాగుతోందన్నారు. పొగాకు రైతులు, మత్స్యకారులు, వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నామని, మార్కెట్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
Kollu Ravindra Comments: సూపర్ సిక్స్ అమలు దిశగా అడుగులు
తమిళనాడు మత్స్యకారుల సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎపి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించిందని గుర్తుచేశారు. పేదల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లోందన్నారు. ఆక్వా రంగం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి చెప్పారు. ముడి సరుకుల ధరలు పెరగడం, డిమాండ్ తగ్గడం వంటి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రంగాన్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎగుమతుల ప్రోత్సాహం, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, రైతులకు సాంకేతిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పొడపాటి తేజశ్విని తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

