Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

వార్త 1 week ago

AP EAPCET Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు’ (AP EAPCET 2026 Results) ను ఇవాళ (జూన్ 1) అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ కానుంది.

Read also:JEE Advanced 2026 Results:జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

మే నెలలో ముగిసిన పరీక్షలు – కీ అప్‌డేట్

 AP EAPCET Results 2026 Expected Today: Check Scores at cets.apsche.ap.gov.in

ఈ ఏడాది జేఎన్‌టీయూ కాకినాడ నేతృత్వంలో మే 12, 13, 14, 15 మరియు 18 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగాల పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరిగాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక కీ (Provisional Answer Key) మే 25న విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ మే 27తో ముగిసింది.

AP EAPCET Results 2026: ర్యాంకుల కేటాయింపు విధానం (Weightage Rule)

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల ఫైనల్ ర్యాంకులను కేవలం ఈఏపీసెట్ మార్కుల ఆధారంగానే కాకుండా వెయిటేజీ పద్ధతిలో కేటాయించనున్నారు:

  • 75% వెయిటేజీ: ఏపీ ఈఏపీసెట్ నార్మలైజ్డ్ మార్కులకు.
  • 25% వెయిటేజీ: ఇంటర్మీడియట్ (Class 12) మార్కులకు. ఈ విధానం ద్వారా లెక్కించిన టోటల్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఆలిండియా/స్టేట్ ర్యాంకులను ఖరారు చేస్తారు. ఈ ర్యాంక్ కార్డ్ కేవలం ప్రస్తుత విద్యాసంవత్సరం (2026-27) అడ్మిషన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

క్వాలిఫైయింగ్ మార్కులు (Cut-off)

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు (Minimum Qualifying Marks) నిబంధన లేదు.

ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలను చూసుకునే విధానం

ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు కింద పేర్కొన్న సాధారణ స్టెప్స్ ఫాలో అయి తమ ర్యాంక్ కార్డ్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

  1. మొదటగా అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్cets.apsche.ap.gov.in ను సందర్శించాలి.
  2. హోమ్‌పేజీలో కొత్తగా అందుబాటులోకి వచ్చే ‘AP EAPCET 2026 Result / Rank Card’ ట్యాబ్/బాక్స్‌పై క్లిక్ చేయాలి.
  3. అక్కడ ఓపెన్ అయ్యే లాగిన్ విండోలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number) మరియు ఈఏపీసెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) ఎంటర్ చేయాలి.
  4. వివరాలు నమోదు చేసిన తర్వాత ‘View Result’ పై క్లిక్ చేయాలి.
  5. స్క్రీన్ మీద మీ ఫలితాలు మరియు ర్యాంక్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అడ్మిషన్ల కౌన్సెలింగ్ వెరిఫికేషన్ కోసం ప్రింట్ తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha