Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లితో గొడవలే కారణమా?

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లితో గొడవలే కారణమా?

వార్త 2 weeks ago

Gooty suicide case:గుత్తి పట్టణంలోని కోట ప్రాంతంలో నివాసం ఉండే ఆఫ్రిన్ 19 అనే విద్యార్థిని శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. చాంద్ అలియాస్ గోరె, ఖైరన్ బి ల కుమార్తె అయిన ఈ యువతి ఇటీవల స్థానికంగా ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని, గుంతకల్లులో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది… ఆత్మహత్య కు గల కారణాలు తెలియ రాలేదు… తండ్రి ఉపాధి రీత్యా హైదరాబాద్ లో ఉంటుండగా, తల్లి ఓ గార్మెంట్స్ యూనిట్లో పనికి వెళ్ళేది..

తల్లికి మృతురాలికి మధ్య నిత్యం గొడవ జరుగుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు… మృతురాలి సెల్ ఫోన్ పాస్వర్డ్ సైతం ఎవరో మార్చారని వారు అంటున్నారు.. ఆమె మరణం పట్ల స్థానికులు పలు సందేహలు వ్యక్తం చేస్తున్నారు .ఈ సందర్భంగా అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అర్బన్ సీఐ రామారావు తెలిపారు.. ఆమె మరణానికి కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ లో వాస్తావాలు తెలుస్తాయని సిఐ తెలిపారు.. పూర్తిస్థాయిలో దర్యాప్తుని చేపట్టామని ఆయన వివరించారు.

Read also: NDA Government:కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం:కేంద్ర మంత్రి

Gooty suicide case:ఘటన వెనుక ఉన్న మిస్టరీ

తండ్రి చాంద్ హైదరాబాద్‌లోనే ఉపాధి పొందుతుండగా, తల్లి గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తోంది. తల్లితో ఆఫ్రిన్‌కు తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి సెల్ ఫోన్ పాస్‌వర్డ్ కూడా ఎవరో మార్చారని వార్తలు వస్తుండటంతో, ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha