Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డి.హిరేహళ్ రోడ్డు ప్రమాదం!

డి.హిరేహళ్ రోడ్డు ప్రమాదం!

వార్త 2 months ago

D.Hirehal Mandal Road Accident: అనంతపురం జిల్లా డి.హిరేహళ్ మండల పరిధిలోని కనుకుప్ప గేట్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఎస్.ఐ. గురుప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

బళ్లారి నుంచి రాంపూర్ వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కనుకుప్ప గేట్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పుక్కుర్తి గ్రామానికి చెందిన రైతు సునీల్ కుమార్ మరియు రుషివేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి.

D.Hirehal Mandal Road Accident: వెంటనే వారిని చికిత్స నిమిత్తం బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సునీల్ కుమార్ మృతి చెందారు. రుషివేంద్ర ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు సునీల్ కుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారని, ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

RDTకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు సాధించాం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha