Dailyhunt
RDTకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు సాధించాం!

RDTకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు సాధించాం!

వార్త 3 weeks ago

MLA Amilineni Surendra Babu: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, ముఖ్యంగా బీటీపీ (BTP) కుందుర్పి బ్రాంచ్ కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ ప్రాంత కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్పష్టం చేశారు.

సోమవారం కళ్యాణదుర్గం ప్రజావేదికలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Mana Mulapeta ku Podam: మూలపేట పోర్టు జగనన్న సంకల్పం!

బీటీపీ కాలువ పనుల పునరుద్ధరణ

2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన బీటీపీ కాలువ ప్రాజెక్టు వైసిపి పాలనలో నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. పనులు ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం వ్యక్తిగత నష్టాన్ని సైతం భరిస్తూ ఈ కాలువ పనులను పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు. కృష్ణా జలాలను తీసుకువచ్చి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని తెలిపారు.

MLA Amilineni Surendra Babu: ఆర్డీటీ (RDT) సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు

ఎన్నికల సమయంలో కుందుర్పి ఫాదర్ దేవాలయం వద్ద ఇచ్చిన హామీ మేరకు, ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతులు తీసుకువచ్చామని సురేంద్ర బాబు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహాయంతో ఈ రెన్యూవల్ సాధించామని వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మంచు ఫెర్రర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారని, అలాగే కళ్యాణదుర్గంలో ఆర్డీటీ సారథ్యంలో మరో ఆసుపత్రి నిర్మించనున్నట్లు తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

విపక్షాల అసత్య ప్రచారాలపై హెచ్చరిక

అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో పాత ఫోటోలతో అసత్య ప్రచారాలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ తాగునీటి సమస్యను పట్టించుకోలేదని, ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha