Hyderabad News:హైదరాబాద్ నగరంలోని డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విధులు నిర్వహించే ప్రాంతంలోనే ఇలా జరగడంతో పోలీస్ వర్గాల్లో ఒక్కసారిగా విషాద వాతావరణం అలుముకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.
https://vaartha.com/crime/assam-floods-death-toll-rises-to-31-sivasagar/746665/
dgp office constable suicide
ఉదయం పూట వాష్‌రూమ్‌లో ఘటన
ఈ రోజు ఉదయం సరిగ్గా 5:30 గంటల సమయంలోకానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. శబ్దం వినిపించిన వెంటనే వారు అక్కడికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో పడిఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Hyderabad News:లభ్యమైన సూసైడ్ నోట్ విశేషాలు
ఘటనా స్థలంలో పోలీసులు ఒక నోట్‌బుక్‌లో రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో తన భార్యకు పిల్లలకు ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని స్వామి పేర్కొన్నారు. తాను చనిపోయి దెయ్యంగా మారినా తన కుటుంబాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటానని, తన భార్య పిల్లలు చాలా మంచివారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ నోట్‌లో రాశారు.
Epaper: epaper.vaartha.com
ఏం రాక్షసత్వం!.. చీర కొనివ్వలేదని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి భర్తను చంపిన భార్య!

