Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏం రాక్షసత్వం!.. చీర కొనివ్వలేదని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి భర్తను చంపిన భార్య!

ఏం రాక్షసత్వం!.. చీర కొనివ్వలేదని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి భర్తను చంపిన భార్య!

వార్త 2 weeks ago

Maharashtra Crime: సంసారం అన్నాక చిన్నచిన్న గొడవలు రావడం సహజమే. కానీ, కొన్నిసార్లు ఆ గొడవలే తీవ్ర నిరాశకు, క్రోధానికి దారితీసి ఘోరమైన నేరాలకు కారణమవుతున్నాయి.

తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో అలాంటి అమానుష ఘటనే వెలుగుచూసింది. కేవలం చీర కొనివ్వలేదన్న క్షణికావేశంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ, చివరకు ఒకరి ప్రాణాన్నే తీసింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.

Read Also : Covid : కొవిడ్కు దారేది?

 Wife kills husband by hitting him with a pressure cooker after he failed to buy her a saree!

Maharashtra Crime: మాటామాటా పెరిగి కిచెన్ కుక్కర్‌తో దాడి

పోలీసులు వివరాల ప్రకారం.. హరేరామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవితో కలిసి శిర్గావ్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తనకు ఒక చీర కొనివ్వాలని సునీతా దేవి భర్తను కోరింది. దానికి హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య చిన్నగా గొడవ ప్రారంభమైంది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీతా దేవి, కిచెన్‌లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌ను తీసుకొచ్చి భర్త తలపై బలంగా కొట్టింది. ఆ దాడికి హరేరామ్ సింగ్ కిందపడిపోగా, అనంతరం ఆమె అతని గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి.

కుమారుడి సాక్ష్యం తో అరెస్ట్

బాధితుడైన హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితమైన వ్యక్తి కావడం వల్ల, భార్య చేసిన దాడి నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. హత్య అనంతరం నిందితురాలు ఏమీ తెలియనట్లు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే, ఈ ఘోరం జరుగుతున్న సమయంలో వారి 7 సంవత్సరాల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. సందేహంతో పోలీసులు ఆ చిన్నారిని ప్రత్యేకంగా విచారించగా, తల్లి చేసిన దారుణాన్ని బాలుడు పూసగుచ్చినట్లు వివరించాడు. చిన్నారి ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యంతో అసలు నిజం బయటపడటంతో, సునీతా దేవిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఆకలి మరణాలను అదుపు చేయలేమా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha