Dailyhunt
డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం.. కంపెనీ మేనేజర్ అరెస్ట్

డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం.. కంపెనీ మేనేజర్ అరెస్ట్

వార్త 1 week ago

కిలీ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్లపై చాలా జాగ్రత్తగా ఉండాలి : డిసిపి కిరణ్ ఖారే

Hyderabad crime: డిజిటల్ మార్కెటింగ్ పేరుతో పాతబస్తీ మీరౌచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం), మనీ సర్క్యూలేషన్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ కంపెనీ కంట్రీ సేల్స్ మేనేజర్ హర్యానా రాష్ట్రం గురుగ్రామ్కు చెందిన హరీష్ కుమార్ సింగ్లా (61)ను మీర్ చౌక్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను చార్మినార్ జోన్ డిసిపి కిరణ్ ఖారే ఆదివారం మీర్ చౌక్ ఏసిపి శ్యామసుందర్, ఇన్స్పెక్టర్ కొండలరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

Read also: Surat case: భార్యను చంపి సిమెంట్‌ పెట్టెలో పూడ్చిపెట్టిన భర్త.. లేఖతో వెలుగులోకి!

 Digital marketing fraud scheme alert

Hyderabad crime: ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో భారీ వంచన

హర్యానాకు చెందిన హరీష్ కుమార్ సింగ్లా డిజిటల్ మార్కెటింగ్, ఫరెవర్ లివింగ్ ప్రొడక్టు పేరుతో అమాయక ప్రజలను మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణ తరగతుల పేరుతో 199 రూపాయల నుంచి 249 రూపాయలు వరకు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూళ్లు చేశాడు. స్లో ట్రాక్, మీడియం ట్రాక్ వంటి కాంబో ప్యాకేజీల పేరుతో భారీ మొత్తం డబ్బులు వసూలుచేయటం జరిగింది. ఉత్పత్తులను అమ్మకం కంటే కొత్త సభ్యులను చేర్పించటం ద్వారానే డబ్బు నమ్మించి వస్తుందని మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నడపటం జరిగింది.

తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అనే ప్రకటనలతో జాగ్రత్త

ఇప్పటికే మీర్ చౌక్ పోలీసులు ఈ కేసులో పాతబస్తీకి చెందిన ఏజెంట్లు మహ్మద్ అక్రమ్, మొహహ్మద్ నౌమాన్ రజా, మొహహ్మద్ అస్లాంలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మెర్సిడెస్ బెంజ్ కారు, ఒక మ్యాక్ బుక్, ఒక ఐ ప్యాడ్, మూడు స్మార్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాలో ఉన్న దాదాపు మూడు కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. కంపెనీ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

మోసపూరిత ప్రకటలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని

ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డిసిపి కిరణ్ ఖారే మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే మల్టీలెవెల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ వంటి స్కీమ్ల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపూరిత ప్రకటలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఎవరైనా మిమ్మల్ని ఇటువంటి స్కీమ్ లలో చేరమని ఒత్తిడి చేస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నోవా గ్రూపు చైర్మన్ పై కేసు నమోదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha