Dailyhunt
భార్యను చంపి సిమెంట్‌ పెట్టెలో పూడ్చిపెట్టిన భర్త.. లేఖతో వెలుగులోకి!

భార్యను చంపి సిమెంట్‌ పెట్టెలో పూడ్చిపెట్టిన భర్త.. లేఖతో వెలుగులోకి!

వార్త 1 week ago

Surat case: గుజరాత్‌లోని సూరత్‌లో అత్యంత పాశవికమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్యను కిరాతకంగా చంపి, ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ భర్త నాటకం చివరకు అతడు రాసిన ఒక లేఖతో అడ్డంగా దొరికిపోయాడు.

Read Also: Tadipatri crime: తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి

మిస్సింగ్ కేసుగా మొదలై.. హత్యగా తేలి..

సూరత్‌కు చెందిన విశాల్ సాల్వి (40), తన భార్య శిల్పా సాల్వి (39) నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన శిల్ప కోసం పోలీసులు వెతుకుతుండగా, నిందితుడు రాసిన ఒక లేఖ అతడి నేరాన్ని బయటపెట్టింది. “నేను పెద్ద తప్పు చేశాను, శిల్ప ఇక లేదు” అని విశాల్ రాసిన లేఖ వారి మైనర్ కుమారుడికి దొరకడంతో కథ అడ్డం తిరిగింది.

Surat case: సిమెంట్‌తో కప్పి.. పెట్టెలో మృతదేహం

 Husband who killed his wife and buried her in a cement box… comes to light with a letter!

లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, సలబత్‌పురా పరిధిలోని విశాల్‌కు చెందిన ఒక పాడుబడిన ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఒక మూలన ఉన్న చెక్క పెట్టె నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో తాళం పగలగొట్టి చూడగా.. పచ్చి సిమెంట్‌తో కప్పి ఉన్న స్థితిలో శిల్ప కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి ముందే విశాల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

అనుమానమే హత్యకు కారణమా?

భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే విశాల్ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు విశాల్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విశాల్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పానీపూరీ తిని ఆరేళ్ల బాలుడు మృతి.. మరో 18 మందికి అస్వస్థత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha