Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిల్జీత్ దోసాంజ్ వివాదానికి ఎండ్ కార్డ్.. అభిజీత్ దిప్కే కీలక ప్రకటన!

దిల్జీత్ దోసాంజ్ వివాదానికి ఎండ్ కార్డ్.. అభిజీత్ దిప్కే కీలక ప్రకటన!

వార్త 3 weeks ago

Diljit Dosanjh: పంజాబీ స్టార్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం జరిగింది.

ఈ విషయంపై అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దిల్జీత్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఆయనపై అభిమానం అలాగే ఉందని స్పష్టం చేశారు.

Read Also :Indira Gandhi Death Anniversary: నానమ్మను గుర్తుచేసుకుంటూ రాహుల్‌, ప్రియాంక భావోద్వేగ పోస్ట్‌!

జేఎన్‌యూ విద్యార్థుల నిరసనలతో మొదలైన వివాదం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలపాలని ఓ అభిమాని కోరగా.. తాను కేవలం కళాకారుడినని, రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు దిల్జీత్ గతంలో స్పందించారు. దీనిపై అభిజీత్ దిప్కే విమర్శలు చేశారు. సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ.. నిజ జీవితంలో విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం ద్వంద్వ ప్రమాణాలుగా భావించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కన్సర్ట్‌లో దిల్జీత్ పరోక్ష వ్యాఖ్యలు

ఇటీవల ఢిల్లీలోని జేఎన్‌యూ స్టేడియంలో జరిగిన తన కన్సర్ట్‌లో దిల్జీత్ ఈ వివాదంపై పరోక్షంగా స్పందించారు. తాను కేవలం కళాకారుడినని, పంజాబీలకు పోరాడటం ఎలాగో ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Diljit Dosanjh: దిల్జీత్‌పై అభిమానం తగ్గలేదన్న అభిజీత్

ఈ వీడియో వైరల్ కావడంతో అభిజీత్ దిప్కే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. దిల్జీత్‌ను చిన్న తమ్ముడిగా భావించి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డప్పటికీ, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని తెలిపారు. అంతేకాకుండా తాను దిల్జీత్‌కు వీరాభిమానినని, ఆ అభిమానంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. గతంలో అమెరికాలో జరిగిన దిల్జీత్ కన్సర్ట్‌కు వెళ్లిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా దిల్జీత్‌పై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని చెబుతూ.. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలుకుదామని అభిజీత్ పిలుపునిచ్చారు.

సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha