Indira Gandhi Death Anniversary: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఆమెను గుర్తుచేసుకున్నారు.
అక్టోబర్ 31న ఆమె వర్ధంతిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీతో కలిసి దిగిన పాత ఫొటోలను ఎక్స్‌లో పంచుకుంటూ తమ నానమ్మపై అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Indira Gandhi Death Anniversary: నానమ్మతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రాహుల్, ప్రియాంక
ఈ సందర్భంగా ఇందిరాగాంధీని ఉద్దేశించి రాహుల్, ప్రియాంక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ''మీరు ఎంతో గొప్ప మహిళ. లోతైన ఆలోచనలు, దృఢమైన వ్యక్తిత్వం మీ సొంతం'' అంటూ ఆమెను స్మరించుకున్నారు. పాత ఫొటోలతో పాటు ఈ సందేశాలను పంచుకోవడంతో ఇందిరాగాంధీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు.

