Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'దిమాగీ నక్సల్స్'పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

'దిమాగీ నక్సల్స్'పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

వార్త 2 weeks ago

PM Modi in Bastar: దేశంలో నక్సలిజం సవాలు ఇంకా ముగిసిపోలేదని, సమాజంలోని పలు సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి 'దిమాగీ నక్సల్స్' చొరబడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

వీరంతా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ప్రతి ఏటా భద్రతా దళాలతో కలసి పండుగలు జరుపుకునే సంప్రదాయంలో భాగంగా, ఈ ఏడాది ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోజవాన్లతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

Abhijit Deepke: సీఈసీ రాజీనామా చేస్తే మోదీకి ఓటమి తప్పదు: దీప్కే

'దిమాగీ నక్సల్స్'తో ముప్పు!

కరన్‌పూర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌ను సందర్శించిన ప్రధాని, తొలుత అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “సాయుధ నక్సలైట్లను అడవుల నుంచి పూర్తిగా తుడిచిపెట్టాం. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ‘దిమాగీ నక్సల్స్’ (అర్బన్ నక్సల్స్) అనేక సంస్థలను, రాజకీయ పార్టీలను ఆక్రమించారు. వారు దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిని గు గుర్తించి ఓడించడం ద్వారా దేశ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వాల్లో భద్రతా దళాల చేతులు కట్టేశారు!

గతంలో పాలించిన ప్రభుత్వాలు నక్సల్ వ్యతిరేక పోరాటంలో ఉన్న సైనిక దళాల స్వేచ్ఛను హరించాయని ప్రధాని మోదీ విమర్శించారు. “గతంలో నక్సల్ దాడులు జరిగినప్పుడు ఎదురుదాడి చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ మా ప్రభుత్వం వచ్చాక భద్రతా దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చాం. ప్రభుత్వ వ్యవస్థల్లోనే ఉంటూ నక్సలిజానికి మద్దతు ఇచ్చిన వ్యక్తుల నెట్‌వర్క్‌ను సైతం మట్టుబెట్టాం” అని పేర్కొన్నారు.

బస్తర్‌లో వెల్లివిరిసిన పండుగ ఉత్సాహం

మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్ మారుతోందని, ఆప్యాయతతో కూడిన సేవ ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజల్లో ప్రభుత్వం నమ్మకాన్ని నింపిందని మోదీ తెలిపారు. వేడుకల సందర్భంగా భద్రతా దళాల జవాన్లు ప్రధాని సమక్షంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. “భారత్ మాతాకీ జై” నినాదాలతో కరన్‌పూర్ క్యాంప్ మారుమోగింది.

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha