Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిమాండ్లు తీర్చకుంటే పోరాటమే.. కూటమి ప్రభుత్వంపై ఏపీజేఏసీ సంఘాల హెచ్చరిక

డిమాండ్లు తీర్చకుంటే పోరాటమే.. కూటమి ప్రభుత్వంపై ఏపీజేఏసీ సంఘాల హెచ్చరిక

వార్త 1 week ago

AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి శంఖారావం పూరించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించింది.

విజయవాడలో ఆదివారం నాడు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 28 జిల్లాల నుంచి ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు.

Read also:Free Laptop Scheme: ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ నిజమా? విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక ఇదే!

డీఏ, ఐఆర్ బకాయిలపై తేల్చాల్సిందే.. 13 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు!

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం (డీఏ) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, పోరాటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

తదుపరి కార్యాచరణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు 13 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కమిటీ సోమవారం (జూన్ 8) నుంచే తన పనిని ప్రారంభించనుంది. ఈ ఉద్యమానికి ఇతర ఉద్యోగ సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఉద్యోగుల భవిష్యత్తు కార్యాచరణపై సోమవారం మరో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు నేతలు పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

కర్నూలులో పని భారంతో వీఆర్వో బలవన్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha