Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దీపావళికి 'ఫోన్‌పే' బంపర్ ఆఫర్.. రూ. 11లకే రూ. 25,000 బీమా

దీపావళికి 'ఫోన్‌పే' బంపర్ ఆఫర్.. రూ. 11లకే రూ. 25,000 బీమా

వార్త 3 weeks ago

PhonePe Firecrackers Insurance: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బాణసంచా పేలుస్తూ సందడి చేస్తుంటారు. అయితే, పండుగ ఉత్సాహంలో చిన్నపాటి పొరపాట్లు జరిగినప్పుడు టపాసుల వల్ల గాయాలపాలయ్యే ప్రమాదం ఉంటుంది.

తీవ్రమైన గాయాలైతే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చి వేలల్లో వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఇటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించి, పండుగ సమయంలో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి ఫోన్‌పే ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

Read Also : Container Manufacturing: కంటైనర్ తయారీ రంగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

 Rs. 25,000 coverage for just Rs. 11 - Insurance against firecracker accidents during Diwali

బాణసంచా కాల్చే సమయంలో జరిగే ప్రమాదాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ‘ఫోన్‌పే’ (PhonePe) సంస్థ ‘ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్’ కంపెనీతో జతకట్టింది. తన ప్లాట్‌ఫామ్‌లో “ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్” (Firecrackers Insurance) అనే పేరుతో ఈ బీమాను ప్రవేశపెట్టింది. కేవలం రూ.11 నామమాత్రపు ప్రీమియం చెల్లించి ఈ ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు. బాణసంచా వల్ల కాలిన గాయాలైనా లేదా ఇతర ప్రమాదాలు జరిగినా గరిష్టంగా రూ.25,000 వరకు వైద్య చికిత్స ఖర్చులను ఈ బీమా ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.

PhonePe Firecrackers Insurance: ఎవరెవరికి కవరేజీ, లభించే ప్రయోజనాలు

ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు పిల్లలకు కూడా బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదం జరిగి 24 గంటలకు పైగా ఆస్పత్రిలో నిమిత్తమై చికిత్స పొందినా లేదా డే కేర్ చికిత్సలు తీసుకున్నా ఈ బీమా ప్రయోజనం వర్తిస్తుంది. దీనివల్ల నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది.

రెండు రకాల ప్లాన్లు: 11 రోజులు, 30 రోజుల వ్యవధి

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫోన్‌పే ఈ ఇన్సూరెన్స్‌లో రెండు రకాల ఆప్షన్లను అందిస్తోంది:

  • 11 రోజుల ప్లాన్: దీని ప్రీమియం రూ.11 గా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న నాటి నుంచి 11 రోజుల పాటు కవరేజీ వర్తిస్తుంది. పండుగ రోజుల్లో మాత్రమే బాణసంచా కాల్చేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
  • 30 రోజుల విస్తృత ప్లాన్: దీని ప్రీమియం రూ.21 గా నిర్ణయించారు. దీపావళి సీజన్ మొత్తం టపాసులు పేల్చేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా నెల రోజుల పాటు కవరేజీ లభిస్తుంది.

ఈ రెండు ప్లాన్లలోనూ గరిష్టంగా రూ.25,000 వరకు వైద్య చికిత్స ఖర్చుల పరిమితి ఉంటుంది.

ఫోన్‌పే యాప్‌లో ఎలా తీసుకోవాలి?

ఈ ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ పాలసీని ఫోన్‌పే యాప్‌ ద్వారా సులువుగా కొనుగోలు చేయవచ్చు:

  1. ముందుగా మీ మొబైల్‌లోని PhonePe యాప్‌ను ఓపెన్ చేయాలి.
  2. సెర్చ్ బార్‌లో ‘Firecrackers Insurance’ అని టైప్ చేయాలి.
  3. మీ అవసరానికి తగిన ప్లాన్ (11 రోజులు లేదా 30 రోజులు) ఎంచుకోవాలి.
  4. మీ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి.
  5. అనంతరం ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేస్తే పాలసీ ప్రక్రియ పూర్తవుతుంది.

పాలసీ పత్రాలు, పూర్తి వివరాలు మీ ఈ-మెయిల్‌కి అందుతాయి. పండుగ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వివరాల ఆధారంగా ఆస్పత్రిలో సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.

Lay's చిప్స్ సంస్థ కు బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha