Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కంటైనర్ తయారీ రంగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కంటైనర్ తయారీ రంగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వార్త 3 weeks ago

Container Manufacturing: దేశంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా కంటైనర్ల తయారీని విస్తృతంగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక పథకానికి కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది.

స్వయం సమృద్ధి దిశగా మరో అడుగు

గత కొంతకాలంగా లాజిస్టిక్స్ రంగంలో కంటైనర్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో, దేశీయంగానే వీటిని తయారు చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్‌ను పూర్తి స్వయం సమృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రణాళికను రూపొందించింది. ఈ నిర్ణయం ద్వారా తయారీ రంగానికి కొత్త ఊపు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Epaper: epaper.vaartha.com

హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. నలుగురు పోలీసులపై వేటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha