D.C Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అభిమానులు, పార్టీ శ్రేణులు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
D.C Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్‌ను కొనియాడిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ తన సందేశంలో పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ ప్రజల్లో ఎంతో ప్రజాదరణ, గౌరవం పొందిన నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వ సుపరిపాలన ఎజెండాను ముందుండి నడిపిస్తున్న తీరును అభినందించిన మోదీ, సమాజ సేవలో ఆయన సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రధాని ట్వీట్‌కు పవన్ కల్యాణ్ భావోద్వేగంగా స్పందిస్తూ, మోదీ చూపించిన అభిమానం, మార్గదర్శకత్వం ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేయడానికి తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని ధన్యవాదాలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా, చంద్రబాబు, లోకేశ్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ‘దేవుడిచ్చిన అన్నయ్య’ అంటూ పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వీరందరితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ఎంపీ రవికిషన్ తదితరులు పవన్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు సందేశాలు పంపారు.

