D.C Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ప్రత్యేక పోస్టులు చేశారు. పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ ఆయన సేవలను కొనియాడారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Read Also : Talliki vandanam scheme: తల్లికి వందనం పెండింగ్ అమౌంట్ డేట్ ఫిక్స్
CM and Minister extend birthday wishes to Pawan Kalyan.
D.C Pawan Kalyan Birthday: ప్రియ మిత్రుడికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు
చంద్రబాబు తన పోస్టులో .. “ప్రియ మిత్రుడు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘పవర్‌స్టార్’గా అభిమానుల గుండెల్లో మీరు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు” అని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పవన్ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గిరిజన ప్రాంత గ్రామాలకు రహదారుల అనుసంధానం, పచ్చదనం పెంపు వంటి ఎన్నో కీలక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
‘దేవుడిచ్చిన అన్నయ్య’ అంటూ నారా లోకేశ్ ట్వీట్
మంత్రి నారా లోకేశ్ సైతం పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగంగా స్పందించారు. “దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కల్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పలు సామాజిక, సేవా కార్యక్రమాలతో అభిమానులు వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని లోకేశ్ ఈ సందర్భంగా కొనియాడారు.

