Supreme Court Directs Anant Singh : జేడీ(యూ) నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే అనంత సింగ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో ఆయన డిసెంబర్ 1లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఈ హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంత సింగ్‌ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేయగా, ఈ ఏడాది మార్చిలో పాట్నా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ మరియు జస్టిస్ ప్రసన్న బి. వరాళేలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని బీహార్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు నెలల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో, మోకామా ఎమ్మెల్యే అనంత సింగ్ మరియు మాజీ శాసనసభ్యురాలు నీలం దేవిలను జేడీ(యూ) ఇటీవల ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.
ఫోన్ చూడొద్దని మందలించినా వినలేదని దారుణం.. కుమార్తెను చంపిన తల్లి

