Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిసెంబర్లో తెలంగాణ లో 'ఖేలో ఇండియా' యూత్ గేమ్స్

డిసెంబర్లో తెలంగాణ లో 'ఖేలో ఇండియా' యూత్ గేమ్స్

వార్త 1 week ago

Khelo India : క్రీడారంగానికి సరికొత్త ఉత్తేజం అందిస్తూ, ప్రతిష్ఠాత్మక 'ఖేలో ఇండియా' యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న ఈ మహా క్రతువుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ఉన్న ప్రధాన స్టేడియాల ఆధునీకరణతో పాటు, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వివిధ రకాల క్రీడాంశాలకు అనుగుణంగా వేదికలను (Venues) ముందే గుర్తించి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

అంతర్జాతీయ స్థాయి ల్యాండ్‌మార్క్‌గా ప్రారంభ, ముగింపు వేడుకలు

ఈ క్రీడోత్సవాన్ని కేవలం ఆటలకే పరిమితం చేయకుండా, రాష్ట్ర ప్రతిష్టను గ్లోబల్ స్థాయిలో చాటిచెప్పేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రారంభ, ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ వేడుకల్లో భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు, దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన దిగ్గజ క్రీడాకారులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణను దేశంలోనే ప్రముఖ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కొత్త పెన్షన్లలకు ఈ సర్టిఫికెట్లు అవసరం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha