PM Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు గురువారం అధికారికంగా వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూలు త్వరలోనే ఖరారు కానుంది.
KTR Speech: కేసీఆరే సీఎం అవుతారు.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
PM Modi to visit Telangana in December; here's a look at the projects set to be inaugurated
PM Modi: డిసెంబర్ పర్యటనలో ప్రారంభం కానున్న కీలక ప్రాజెక్టులు
కాజీపేటలో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో రైల్వే కోచ్‌లు, వ్యాగన్లు, మెట్రో కోచ్‌ల తయారీ చేపట్టనున్నారు. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడంతో పాటు, వారి సంస్కృతి, సంప్రదాయాలు, అటవీ వనరుల నిర్వహణకు సంబంధించిన కోర్సులు అందించడం ఈ వర్సిటీ ప్రత్యేకతగా నిలవనుంది.
మరోవైపు ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమైతే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, వాణిజ్య సరుకుల రవాణాకు సమయం ఆదా కానుంది. ఇక వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారనే వార్తలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించే అవకాశం ఉంది.
నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్
ప్రధాని మోదీ పర్యటనకు ముందు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ రెండో వారంలో తెలంగాణకు రానున్నారు. ఆయన బూత్ స్థాయి కమిటీ సమావేశాల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు, హైదరాబాద్, కరీంనగర్‌లలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రైల్వే, రహదారి, విద్య, విమానయాన రంగాలకు చెందిన ప్రాజెక్టులతో ప్రధాని మోదీ డిసెంబర్ పర్యటన తెలంగాణ అభివృద్ధికి సరికొత్త ఊపునివ్వనుంది.
Epaper: epaper.vaartha.com

