Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేసీఆరే సీఎం అవుతారు.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కేసీఆరే సీఎం అవుతారు.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

వార్త 1 day ago

KTR Speech: గత ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అబద్ధపు హామీలు, తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు.

Ponnam Prabhakar: ఇళ్ల కేటాయింపులో పేదలకే మొదటి ప్రాధాన్యం

 KCR will become CM - KTR's sharp remarks at Telangana Bhavan

KTR Speech: మళ్లీ కేసీఆర్‌కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌కు ఓటు వేసి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు పెరిగిపోయి రైతులు తీవ్రంగా గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు 10 నెలల ముందే అప్రమత్తం చేసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కూలిపోయిందంటూ కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. చివరికి రాహుల్ గాంధీని కూడా తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను విమర్శించే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటవుతున్నాయని.. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన “పిచ్చోడి చేతిలో రాయిలా” తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి హడావుడి ఇంకా కొద్దికాలమే.. మళ్లీ కేసీఆరే సీఎం

రేవంత్ రెడ్డి ప్రభుత్వ హడావుడి ఇంకా కొద్దికాలమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లూటీ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. త్వరలోనే దేశ రాజకీయాలో కేసీఆర్ మళ్లీ కీలక పాత్ర పోషించబోతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల కూటమి అత్యంత కీలకం కాబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

Epaper: epaper.vaartha.com

అక్టోబర్ 28న బడుల్లో ఈ-వ్యర్థాల డ్రైవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha