Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన - కేంద్ర మంత్రి రామ్మోహన్

డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన - కేంద్ర మంత్రి రామ్మోహన్

వార్త 2 weeks ago

Warangal Airport : ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. వరంగల్ మామునూరు విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే డిసెంబర్ నెలలోనే విమానాశ్రయ నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓరుగల్లు నగరం పారిశ్రామికంగా, రవాణా పరంగా తీవ్ర పురోగతి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక మరియు ప్రకృతి రమణీయ ప్రాంతాలను అనుసంధానిస్తూ హెలికాప్టర్ల ద్వారా ‘హెలీ టూరిజం’ (Heli-Tourism) ప్రవేశపెట్టేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజం అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, స్థానికంగా స్వయం ఉపాధి అవకాశాలు, ఆదాయం కూడా పెరుగుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, తెలంగాణలో విమానయాన రంగానికి, పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

సుస్మితకు మాట్లాడే హక్కుంది.. వద్దని చెప్పలేను - సురేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha