Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుస్మితకు మాట్లాడే హక్కుంది.. వద్దని చెప్పలేను - సురేఖ

సుస్మితకు మాట్లాడే హక్కుంది.. వద్దని చెప్పలేను - సురేఖ

వార్త 2 weeks ago

Konda Susmitha : తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదంలో తన వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు వివరించినట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఒక పౌరురాలిగా తన కుమార్తెకు ఏ విషయంపైనైనా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉందని, ఆమెను మాట్లాడవద్దని చెప్పే అధికారం తనకు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తన మంత్రి పదవితో లేదా రాజకీయ బాధ్యతలతో ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తానూ చెప్పాల్సిన పూర్తి వివరాలను పార్టీ అధిష్ఠానానికి స్పష్టంగా వివరించానని తెలిపారు.

సామాజిక సమీకరణాలు - బీసీ కార్డుతో అధిష్ఠానానికి విజ్ఞప్తి

తాను రాష్ట్రంలో అత్యంత కీలకమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలినని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని సురేఖ గుర్తుచేశారు. తాను పద్మశాలి వర్గానికి, తన భర్త కొండా మురళి మున్నూరు కాపు వర్గానికి చెందినవారని, ఈ రెండు బీసీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు రాష్ట్రంలో సుమారు 16 శాతం వరకు ఉందని అధిష్ఠానానికి విశ్లేషించారు. క్రమశిక్షణ చర్యల పేరుతో బీసీ మహిళా నేతపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది సామాజికంగా, రాజకీయంగా సరికాదని అభిప్రాయపడ్డారు. తనపై ఎలాంటి మచ్చ లేనందున మంత్రి పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరినట్లు వెల్లడించారు.

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఒక్కటవుతారు: కొండా సురేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha